May 14,2023 12:59

మనోవీధిన విస్తరించిన నిశిరాత్రుళ్ళు
చీకటి నీడలా వెంటాడి
హృదయపు వీపున కొక్కెం గుచ్చి
వేలాడుతూ ఆ హృదయాన్ని
శిథిల గాయం చేస్తే

ఆ గాయం
విషాద గేయమై
చెరిగిపోని వ్రణం మచ్చలా
ఏ ఔషధికీ మానని రుగ్మతై

మనోయవనికపై
నల్లని జిగురు పట్టిన మసిలా
అంటుకోపోతే

రక్తమోడుతున్న
భరింపలేని పెను నొప్పితో
నా మనో మైదానం
మోడైన హృదయమై
నిర్జీవంలా బ్రతుకీడుస్తుంటే

మనోనిబ్బరం వెన్నుతట్టి
గాయాల గేయాలను
మధుర కవితాగానాలుగా మార్చి
మది వసంత గీతం పాడించె.


నాగముని.యం
9490856185