ప్రముఖ హీరో రామ్ పోతినేని తాజాగా నటిస్తున్న చిత్రం 'స్కంద'. ఈ చిత్రం ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రామ్- శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమా ఈ నెల 28వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ మంగళవారం ట్రైలర్‌ని విడుదల చేసింది. ఇందులో హీరో రామ్ యాక్షన్, డైలాగ్ డెలివరీ హైలెట్‌గా నిలవనుంది. 'నేను సంపేటపుడు వాడి తలకాయ యాడుందో చూస్తాను..ఆడి యెనకాల ఎవరున్నారో సూడను.. రింగ్‌లో దిగితే రీసౌండ్ రావాలె.. సూసుకుందాం.. బరాబర్ సూసుకుందాం..' అంటూ రామ్ పోతినేని చెప్పిన పంచ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.










