ప్రజాశక్తి-గూడూరు : గూడూరు నుండి చనుగొండ్ల మీదుగా కోడుమూరు వరకు రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని శనివారం నాడు చనగండ్ల గ్రామంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లో ప్రజలతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం మండల కార్యదర్శి జే మోహన్ పాల్గొని ఆయన మాట్లాడుతూ గూడూరు చనగొండ్ల మీదుగా కోడుమూరు వరకు ఉన్న రహదారి గుంతల మయమైందని 15 సంవత్సరాల క్రితం రోడ్డు వేశారని వేసిన సంవత్సరానికి వర్షాలు కారణంగా గుంతలు ఏర్పడ్డాయని ఇప్పటివరకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టలేదని అన్నారు. ఈ మార్గంలో ప్రజలు పేషెంట్లు గర్భిణీలు బాలింతలు ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. గతంలో చనుగొండ్ల గ్రామంలో నిండు గర్భిణీ కాన్పు కోసం హాస్పిటల్ కు వెళ్లే లోపు మార్గం మధ్యలోనే అంబులెన్స్ లోనే ప్రస్తరించిందని గతంలో ఆర్టీసీ వాళ్ళు ఈ రోడ్డు మార్గాన్ని రెండు బస్సులు నడిపే వారని రోడ్డు మొత్తం గుంతల మయం కావడంతో ఆఫీస్ వారు బస్సులు నడపకపోవడంతో విద్యార్థులు చనుగొండ్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రోడ్డు సమస్యలను జూన్ నెలలో చనగండ్ల గ్రామంలో గడప గడప కార్యక్రమంలో కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ దృష్టికి సిపిఎం పార్టీ తీసుకొని వెళ్ళామని నాడు ఎమ్మెల్యే పది రోజుల్లో రోడ్డు నిర్మాణ పనులు చేపడతామని ప్రజల సాక్షిగా హామీ ఇచ్చారని తెలిపారు. ఇప్పుడు 20 రోజులు దాటినా కూడా రోడ్డు గురించి ఎమ్మెల్యే గారు అధికారులు గానీ స్పందించడం లేదని ఈ గ్రామంలో మండల అధ్యక్షురాలు ఎంపీపీ ఉన్న ప్రజలు ఇంతలా ఇబ్బందులు పడుతున్న ఆమె కూడా స్పందించడం లేదని అన్నారు. ఈ విధంగా పాలకులు చనుగొండ్ల గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్న పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఇప్పటికైనా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ గూడూరు మండల అధ్యక్షురాలు ఎంపీపీ మరియు అధికారులు స్పందించి వెంటనే గూడూరు నుండి చనగుండ్ల మీదుగా కోడుమూరు వరకు రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని లేనిపక్షంలో గ్రామ ప్రజలు ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మాధవ కృష్ణయ్య, కోటయ్య, రామాంజనేయులు, సుధాకర్ రంగ నాయుడు డివైఎఫ్ఐ నాయకులు రమేష్, రంగడు ఉపేంద్ర, మహేంద్ర, తదితరు కార్మికులు పాల్గొన్నారు.










