Jul 26,2023 15:08
  • పెనుగంచిప్రోలు ఎస్ ఐ. దుర్గా ప్రసాద్ 

ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు(ఎన్టీఆర్ జిల్లా) : గత మూడు రోజుల నుంచి భారీగా వర్షాలు కురుస్తున్నందున వాగులు వంకలు, పొంగి ప్రవహిస్తున్నందున మున్నేరు నది ఉదృతంగా ప్రవహించడంతో ప్రజలు అప్రమత్తంగా వుండాలని పెనుగంచిప్రోలు ఎస్ ఐ.దుర్గా ప్రసాద్  తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో రైతులు పొలాల్లోకి వెళ్లి వర్షం కురుస్తున్న సమయంలో విద్యుత్ మోటార్లు వద్దకు వెళ్లి స్వీ చ్ ఆన్ చేయవద్దని, రైతులు పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటిలో వున్న గృహిణీలు చిన్న పిల్లల పట్ల జాగ్రత్తలు పాటించాలని అన్నారు. చిన్నారులను తడిచిన గోడలకు వున్న విద్యుత్ పరికరాలను ముట్టుకోకుండా తల్లిదండ్రులు పలు జాగ్రత్త లు తీసుకోవాలని తెలిపారు. రోడ్ల పక్కన వున్న కరెంట్ స్తంబాలు పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టే ప్రమాదం ఉందాన్నారు. రోడ్లపై ఏర్పడిన గుంటలాల్లో వర్షం నీరు నిండి ఉంటాయి కావున వాహనదారులు తగ్గు జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలని చూచించారు. మునేరుకి ఎగువన కురిచిన వర్షాలు వలన వరద పెరుగుతుంది. కనుక మునేరులో ఎవరూ దిగవద్దని ప్రజలు అప్రమత్తం గా వుండాలని తెలిపారు.