Jul 13,2023 10:33

ప్రజాశక్తి -పెద్దకడబూరు : మంత్రాలయం ఎమ్మెల్యే సీటు 2024 గెలుపుపై వైసీపీ టిడిపి నేతలు సవాలు చేస్తూ రెండు కోట్ల పందెం కాయడం గురువారం ఉదయం 11 గంటలకు ఉరుకుంద దేవస్థానానికి రావాలని ప్రకటించుకోవడం ఇరువురికి నోటీసులు జారీ చేసినట్లు పెద్ద కడుబూరు ఎస్సై శ్రీనివాసులు గురువారం తెలిపారు. వైసీపీ నేత మాజీ ఎంపీపీ రఘురాం టిడిపి నేత మల్లికార్జునకు నోటీసులు ఇచ్చి కానిస్టేబుళ్లను ఇరువురి వద్ద పెట్టినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.