Apr 22,2023 16:20

ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ ఆఫీసర్స్ క్లబ్ లో కిరణ్ మెమోరియల్ షటిల్ టోర్నమెంట్ ను శనివారం జిల్లా ఎస్పి ఎస్. సతీష్ కుమార్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి మాట్లాడుతూ దేహదారుధ్యానికి క్రీడలు చాలా అవసరమని, బాల బాలికలు అందరూ క్రీడల్లో పాల్గొవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పి. తో పాటు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ద్వారంపూడి వీరభద్ర రెడ్డి, కాకినాడ డిఎస్పి పి. మురళీకృష్ణ రెడ్డి, ఇతర ప్రముఖులు, కాకినాడ ఆఫీసర్స్ క్లబ్ కార్యవర్గం,సభ్యులు, పోలీస్ అధికారులు, క్రీడాకారులు పాల్గొనడం జరిగింది.