ప్రజాశక్తి - రెడ్డిగూడెం: రెడ్డిగూడెం మండల వైస్సార్ క్రాంతి పదం కార్యాలయం నందు డ్వాక్రా మహిళలకు మహిళా సాధికారత కార్యక్రమంలో మహిళల యొక్క జీవనోపాధిని మెరుగుపరచుటకు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు శ్రీనిధి, ఉన్నతి లింకేజీ రుణాల ద్వారా లబ్ధిదారులకు జెడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయ భాస్కర్ రెడ్డి శుక్రవారం నాడు గొర్రెలు పంపిణీ చేశారు .మండలంలో వివిధ గ్రామాలకు చెందిన 20 మంది లబ్ధిదారులకు ఒక్కొక్క యూనిట్ కి 6గొర్రెలు, ఇన్సూరెన్స్, మెడికల్ కిట్ పంపిణీ చేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లాది రాణి,ఎంపీపీ రాబర్ట్ ,రెడ్డిగూడెం ఎంపీటీసీ సభ్యులు కుప్పిరెడ్డి వరప్రసాద్ రెడ్డి ,రామినేని వీరాస్వామి నాయుడు,మండల సచివాలయల కన్వీనర్ ఉయ్యారు భరత్ కుమార్ రెడ్డి, PACS అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ రెడ్డి , గుజ్జల కోటిరెడ్డి, ఎంపీడీఓ శంకర్ రావు,వెలుగు ఏపీఎం శ్రీనివాస్, మండల సమాఖ్య ప్రెసిడెంట్ గుంటక వెంకటరవమ్మా, మండల సమాఖ్య ప్రతినిధులు, వైఎస్ఆర్ క్రాంతి పద సిబ్బంది సీసీలు, ఆపరేటర్, అకౌంటెంట్, వివో ఏలు, తదితరులు పాల్గొన్నారు.










