Jul 31,2023 15:06

ప్రజాశక్తి-విజయవాడ : ఎస్ఎఫ్ఐ ఎన్.టి.ఆర్. జిల్లా ప్లీనరీ సమావేశాలు జయప్రదం చేయయాలని విజయవాడలో వాల్ పోస్టర్లను ఎస్ఎఫ్ఐ నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఎం.సోమేశ్వరరావు, జిల్లా కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్.ఎఫ్.ఐ) ఎస్.టి.ఆర్.జిల్లా ప్లీనరీ సమావేశాలు మన విజయవాడ నగరంలో 2023, ఆగష్టు 19, 20 తేదీలలో జరగనున్నాయిని అన్నారు. ఎస్.ఎఫ్.ఐ విద్యార్థులలో దేశభక్తి భావాలను పెంపొందించటానికి భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదైవ్, గాంధీ, అల్లూరి, వివేకానంద, సుభాష్ చంద్రబోస్, సుందరయ్య వంటి జాతీయ నాయకుల ఆశయాలను ముందుకు తీసుకువెళుతుందిని. ఈ నేపథ్యంలో ఎస్.ఎఫ్.ఐ విద్యావ్యాపారీకరణ, కేంద్రీకరణ, ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తుందిని, విద్యారంగ పరిరక్షణ, శాస్త్రీయ విద్యా విధానం, విద్యాహక్కు చట్టం అమలు, యూనివర్శిటీ గ్రాంట్స్ పెంపు, సంక్షేమ హాస్టల్స్ మౌళిక సదుపాయాలు, అద్దె భవనాల స్థానంలో సొంత భవనం నిర్మాణానికై, స్కూల్స్లో మంచినీరు, మరుగుదొడ్లు, అదనపు గదుల ఏర్పాటు సాధనకై, ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీల పరిరక్షణకై, స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదలకై అనేక కార్యక్రమాలు నిర్వహించిందిని అన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో పెండింగ్ లో ఉన్నా పాఠ్యపుస్తకాలు వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాల, మున్సిపల్ పాఠశాలల్లో నాడు - నేడు పనులు ప్రారంభించాలని, 3, 4, 5 తరగతుల విలీనం ఆపాలని ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించడం జరిగింది. సంక్షేమ హాస్టల్స్లో సదుపాయాల కల్పన కోసం, నాణ్యమైన ఆహార పదార్థాలు పంపిణీ చేయాలని, మెస్ & కాస్మోటిక్స్ ఛార్జీలకై జిల్లా వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం జరిగింది. దీని ఫలితంగా విద్యార్థులకు మెస్ & కాస్మోటిక్స్ ఛార్జీలు పెంచారు. ఎయిడెడ్ విద్యాసంస్థల పరిరక్షణ కోసం జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ, తిరువూరు మరియు ఇతర ప్రాంతాలలో కార్యక్రమాలు నిర్వహించాము. జి.ఓ.నెం. 77 రద్దు చేసి అర్హులైన పిజి విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన, వసతిదీవెన అమలు చేయాలని, డిగ్రీలో తెలుగు మీడియం యథావిధిగా కొనసాగించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అమ్మఒడి పథకం అమలు చేయాలని, పెండింగ్లో వున్న పిజి విద్యార్థుల ఫీజుల బకాయిలు విడుదల చేయాలని, ఖాళీగా వున్న టీచర్, అటెండర్, వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయాలని, నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, కృష్ణా యూనివర్శిటీ పరిధిలో జరుగుతున్న పరీక్షలు సక్రమంగా నిర్వహించి, పరీక్షా ఫలితాలు వెంటనే ఇవ్వాలని మొ॥ అనేక కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగిందిని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ విజయవాడ నగర నాయకులు మన్మధ, కుమారస్వామి, జాహ్ణవి, తదితరులు పాల్గొన్నారు