Apr 29,2023 15:52

ప్రజాశక్త- నందిగామ: నందిగామ పట్టణంలో ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాల వల్ల మనస్థాపన గురై ఆత్మహత్య చేసుకున్న షేక్ జాన్ సేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్ఎఫ్ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి గోపి నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శనివారం నందిగామ ఆర్డీవో కార్యాలయం నందు ఆర్డీవో ఏ రవీంద్రరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నందిగామ డివిజన్ కార్యదర్శి గోపినాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 27-4-2023 తేదీన ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసిన నేపద్యంలో నందిగామ పట్టణానికి చెందిన షేక్. జాన్ సైదా ఇంటర్మీడియట్ లో ఫెయిల్ ఆయనని మనస్తాపానికి గురై ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చాలా బాధాకరం అన్నారు. తల్లిదండ్రులు రోజువారీగా కూలిపనులకు వెళ్లి ఆ విద్యార్థిని చదివించడం జరుగుతుందని, ఆర్ధికంగా వెనుకబడిన కుటుంబం కావున చనిపోయిన విద్యార్థికి ప్రభుత్వం నుంచి 20లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంటర్మీడియట్ పేపర్ వేల్యూషన్ సక్రంగా జరగాలని ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా  చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని భారత విద్యార్థి ఫెడరేషన్  తరుపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు హసేన్, మహేష్, వెంకటేష్, చందు, నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.