Jun 16,2023 15:30
  • ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్మకాల్ని అరికట్టాలి
  • అనుమతిలేని  ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి
  • ఎస్ఎఫ్ఐ డిమాండ్

ప్రజాశక్తి-కాకినాడ : పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక కిట్లు అందించాలనీ, ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్మకాల్ని అరికట్టాలనీ, అనుమతిలేని  ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఇంచార్జ్ పాఠశాల ఉపాతానికి అధికారి గణేష్ బాబుకు శుక్రవారం జిల్లా ఎస్ఎఫ్ఐ బృందం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా  పాఠశాలలో ప్రారంభమై మూడు రోజులు గడుస్తోందన్నారు. నేటికీ అనేక సమస్యలు ప్రభుత్వ ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్నాయన్నారు. ఇప్పటికకి చాలా పాఠశాలకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, విద్యా కానుక కిట్లు ఇంకా అందలేదన్నారు. కావున అన్ని పాఠశాలకు విద్యా కానుక కిట్లు అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అనుమతులు లేకుండా నడుపుతున్న ప్రైవేట్ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య హక్కు చట్ట ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ అమ్మకాలు చేయకూడదు కానీ చాలా పాఠశాలలో పాఠ్యం పుస్తకాలు, స్టేషనరీ అధిక రేట్లకు అమ్మడం జరుగుతుందన్నారు. ఏ పాఠశాల పేరు మీద ఆ పాఠశాల పుస్తకాలు అమ్ముతూ తమ పాఠశాలలోనే పాఠ్యపుస్తకాలు కొనాలని తల్లిదండ్రులును ఒత్తిడికి చేస్తున్నారన్నారు. కావున ఎటువంటి అనుమతులు లేకుండా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ అమ్ముతున్నటువంటి విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి దినేష్ కుమార్, జిల్లా నాయకులు శివరాజు తదితరులు పాల్గొన్నారు.