- ఎస్ఎఫ్ఐ
ప్రజాశక్తి-చందర్లపాడు : చందర్లపాడు MEOకి ఎస్ఎఫ్ఐ నాయకులు గురువారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు గోపి నాయక్ మాట్లాడుతూ జూనియర్ కాలేజీ & ప్రభుత్వం పాఠశాలలో టెక్స్ట్ బుక్స్ యూనిఫామ్ & షూస్ విడుదల చేయాలని స్కూల్ ప్రారంభించి నెల రోజులు అవుతుంది. ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో టెక్స్ట్ బుక్స్ విద్యార్థులకు అందలేదు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి టెస్ట్ బుక్స్ యూనిఫామ్ అందజేయాలని, పెండింగ్ లో ఉన్న నాడు నేడు పనులు పూర్తి చేయాలని, అమ్మ ఒడి బటన్ నొక్కి దాదాపు 20 రోజులు అవుతుంది. ఇప్పటివరకు కూడా తల్లుల ఎకౌంట్లో అమౌంట్ జమ కాలేదని అన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. పెండింగ్లో ఉన్న విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. జీవో నెంబర్ 77ను రద్దుచేసి పీజీ విద్యార్థులకు విద్యా దీవెన వసతి దీవెన అమలు చేయాలి. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో జీవో నెంబర్ 35ను రద్దుచేసి ఖాళీగా వున్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి మరియు పెండింగ్ లో ఉన్న నాడు నేడు పనులు పూర్తి చేయాలని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కృష్ణ నాయకులు తదితరులు పాల్గొన్నారు.










