Oct 06,2023 16:00
  • ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ సిహెచ్. పావని డిమాండ్
  • డిగ్రీ కళాశాలకు ప్రహరీ గోడ నిర్మించాలి.
  • గిరిజన పోస్టుమెట్రిక్ హాస్టలుకు సొంత భవనం నిర్మించాలి.
  • ఎస్ఎఫ్ఐ సైకిల్ యాత్ర కమిటీ డిమాండ్

ప్రజాశక్తి-కాకినాడ : నియోజకవర్గంలో గల ప్రభుత్వ, ప్రేవేట్ విద్యాసంస్థలలో వందల మంది విద్యార్థులు చదువుతున్నప్పటికి పాలకొండ కేంద్రంలో పీజీ కళాశాల రాష్ట్ర ప్రభుత్వం నిర్మించకపోవడం చాలా దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ సిహెచ్. పావని మండిపడ్డారు. శుక్రవారం మండలానికి విచ్చేసిన పార్వతీపురం మన్యం జిల్లా సైకిల్ యాత్ర ఐదవ రోజుకు పాలకొండ మండలానికి చేరుకుంది. మొదటగా స్థానిక విద్యాసంస్థల విద్యార్థులతో ఆర్టీసీ డిపో జంక్షన్ నుండి మెయిన్ రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దెశించి పావని మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే విధంగా తమ విధానాలను అనుసరిస్తున్నారని వాపోయారు. ప్రభుత్వ విద్యార్థుల భవిష్యత్తుకు మేలు చేసే విధంగా అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న జగనన్న ప్రభుత్వం మెరుగైన విద్యను అందించడంలో పూర్తిగా విఫలం చెందిందని వాపోయారు. మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రహరీ గోడ లేకపోవడం వల్ల కళాశాల నిష్పత్తి శాతం పడిపోతుందని, ఉన్నత చదువులకై పీజీ సెంటర్, సొంత హాస్టల్ భవనం లేకపోవడం వల్ల చదువులు మధ్యలోనే నిలిపిచిపోయే పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. కావున ప్రభుత్వ వెంటనే స్పందించి మెరుగైన విద్యాభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో నియోజకవర్గ మండల కేంద్రం విద్యారంగ సమస్యలు పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ చేపడుతున్న పోరాట కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మరియు సంక్షేమ హాస్టలకు బకాయిలుగా నిలిచిన మెస్ (డైట్) బిల్లులు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులు పెంచాలని, ఉపాధ్యాయులపై యాప్ల భారం తొలగించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని, మధ్యాహ్న భోజనం పధకం అమలు చేయాలని, డిగ్రీలో తీసుకువచ్చిన హనర్స్ - మైనర్ సబ్జెక్టు విధానాన్ని రద్దు చేయాలని, డిగ్రీ విద్యార్థులు ఇంటర్న షిప్ లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఎన్ఇపి రద్దు చేయాలని, 117 జిఓ రద్దు చేయాలని, పాఠశాలల విలీనం ఆపాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, హాస్టలల్లో పర్మినెంట్ వర్కర్లను, వార్డన్లను నియమించాలని, పోస్టుమెట్రిక్ హాస్టలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, హాస్టళ్లలో ఏఎన్ఎంలను నియమించాలని డిమాండ్ చేశారు. లేని యడల యాత్ర అనంతరం పెద్ద ఎత్తున్న ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్, కార్యదర్శివర్గ సభ్యులు కె.రాజు, హెచ్.సింహాచలం, బి.గంగారావు, కె.భాస్కరరావు మరియు యాత్రలో ఎస్ఎఫ్ఐ నాయకులు అఖిల్, ఉమాశంకర్, సిసింద్రీ, అన్నాజీ, వెంకీ తదితరులు పాల్గొన్నారు.