Oct 06,2023 16:47

ప్రజాశక్తి-ఏలేశ్వరం(కాకినాడ): ఏలేశ్వరంకు చెందిన సాయి శంకర్ నేత్రాలయ వైద్యులు డాక్టర్ అనసూరి నాగేశ్వరరావుకు విశిష్ట సేవా పురస్కారం లభించింది. అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి అందించే విశిష్ట సేవా పురస్కారాలకు గాను 2023వ సంవత్సరానికి నాగేశ్వరావు. ఈ మేరకు రాజమండ్రి ఆనంద్ ఏజెన్సీలో ఇస్రో డైరెక్టర్ గోకృష్ణ, నన్నయ యూనివర్సిటీ విసి కే పద్మరాజు ఆధ్వర్యంలో నాగేశ్వరరావుకు పురస్కారం అందజేశి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏలేశ్వరంలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం అనేక ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్యం అందించడంతోపాటు, వేలాది మందికి ఉచిత శాస్త్ర చికిత్సలు చేయించి  పేదలకు కంటిచూపు తెప్పించిన  నాగేశ్వరావు సేవలు అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కే పార్థసారథి, ఆదిత్య ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ బాలా త్రిపుర సుందరి, ప్రతిభా ఎడ్యుకేషనల్ డైరెక్టర్ మూర్తి ఉన్నారు.