Jul 03,2023 12:33

ప్రజాశక్తి-కాకినాడ : ఈ నెల ఆరవ తేదీ నుంచి అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో నాటకాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నాటకాల్లో 127వ అల్లూరి జయంతి, శత వర్ధంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సీతారామరాజు నాటక కళా పరిషత్ 39వ వార్షికోత్సవ సందర్భంగా ఈ నాటకాల్లో 23వ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వానపు నాటక పోటీలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి వివరాలను సోమవారం కాకినాడలోని క్షత్రియ పరిషత్లో నాటక కళాపరిషత్ ప్రధాన కార్యదర్శి పంపన దయానంద బాబు, గౌరవ అధ్యక్షుడు కర్రి భామిరెడ్డి, పరిషత్ అధ్యక్షుడు కర్రి అచ్యుత రామారెడ్డిలు వెల్లడించారు. ఈ పోటీలను స్థానిక సూర్య కళామందిరంలో ఆరవ తేదీ నుండి తొమ్మిది వరకు జరుగుతాయని చెప్పారు. సమాజంలో ఉన్న రుగ్మతలను, అసమానతులను రూపుమాపేందుకు ఈ నాటికలు ఎంతగానో దోహదపడతాయన్నారు.  ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో నాటికలకు ఆదరణ ఉన్నా నగరాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. నాటకాలకు ఆదరణ తగ్గడం చాలా బాధగా ఉందని సమాజానికి నాటికలు ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చి ఆలోచింపజేస్తాయని వారు చెప్పారు. నాటక కళాపరిషత్ బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ నాటికలను వీక్షించి జయప్రదం చేయాలని దయానంద బాబు, భామిరెడ్డి, అచ్యుత రామారెడ్డిలు కోరారు.