Feb 17,2023 16:59
  • ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

ప్రజాశక్తి-చందర్లపాడు: మండలంలోని మునగాలపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సీజనల్ హాస్టల్ ను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవనోపాధికోసం ఆయా కాలాల్లో వివిధ ప్రాంతాలకు వలస వెళ్ళే కుటుంబాల పిల్లలు - విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఆయా గ్రామాల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీజనల్ హాస్టల్ లను ఏర్పాటుచేసి వారికి విద్యను అందజేయడంతో పాటు 3 పూటలా ఆహారం, సుమారు మూడు నెలల పాటు అక్కడే వసతి ఏర్పాట్లు కల్పించడం జరుగుతుందన్నారు, విద్యార్థుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, చదువుకునే పిల్లలపై ఎటువంటి ఇబ్బందులకు కలగకుండా, జీవన ఉపాధి కోసం వెళ్లే వారి తల్లిదండ్రులకు పిల్లలు భారం కాకుండా, వారి ఆలనా -పాలనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ వేల్పుల యేసమ్మ, ఎంఈఓ బాలాజీ నాయక్, నాయకులు పెద్దబ్బాయి, పాఠశాల అధ్యాపకులు జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.