- రౌడీషీటర్లు, అనుమానస్పద వ్యక్తుల ఇళ్ళల్లో దాడులు
ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ ఆదేశాల మేరకు శాంతిభద్రతలపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అసాంఘిక శక్తులకు అడ్డుకట్ట వేసి నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కర్నూలు నాల్గవ పట్టణ పోలీసులు 40 మంది స్పెషల్ పార్టీ పోలీసులు బృందాలుగా ఏర్పడి గురువారం తెల్లవారుజామున కర్నూలు, శరీన్ నగర్ లో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 10 మంది రౌడీ షీటర్లు, ఇద్దరు ట్రబుల్ మాంగర్స్, 3 సస్పెక్టుల ఇళ్ళల్లో తనిఖీలు నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎరుకలి రామాంజనేయుల ఇంటిలో 2 చిన్న కత్తులు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా సరైన ధృవ పత్రాలు లేని 2 ఆటోలు, 6 ద్వి చక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో కర్నూలు నాల్గవ పట్టణ ఎస్ఐలు పెద్దయ్య నాయుడు , మధుసూదన్ , సునీల్ , కర్నూలు తాలూకా ఎస్సై రామయ్య, స్పెషల్ పార్టీ పోలీసు బృందాలు పాల్గొన్నారు.










