- కోతకు గురవుతున్న బీచ్ రోడ్డు
ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : ఉప్పాడ సముద్ర తీరం ఒక్కసారిగా మార్పు చెందడంతో అలలు ఉవ్వెత్తి న ఎగసి పడుతున్నాయి అలల తాకిడికి ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురవుతుంది అలలు ఎగసి పడటంతో రక్షణగా వేసిన రాళ్లు బీచ్ రోడ్డుపై కి చేరడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు గురవుతున్నారు అలలు బీచ్ రోడ్డు పైకి రావడంతో అటుగా వెళ్లే వాహనదారులు తడిసిపోవాల్సి వస్తుంది కాకినాడ చేరుకోవాలంటే ఉప్పాడ, కొనపపేట, మూలపేట, తదితర గ్రామాలకు అనువుగా ఉండే మార్గం బీచ్ రోడ్డు బుధవారం ఒక్కసారిగా అలలు ఎగసిపడడంతో పిఠాపురం మీదగా వెళ్లాల్సి వస్తుందని పలువురు తెలిపారు శుక్రవారం అమావాస్య కావడంతో అలలు ఎగసిపడతాయని పలువురు మత్స్యకారులు తెలిపారు










