ప్రజాశక్తి-ఆదోని : ఆదోని డివిజన్ పరిధిలోని కోసిగి గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న చిరుత పులలను సంరక్షించాలని వన్య ప్రాణుల కార్యకర్తలు దేవి ప్రసాద్, మూర్తి, వెంకటేష్ కోరారు. శుక్రవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోసిగి పరిసర కొండల్లో చిరుత పులల సంచారం ఉన్నట్లు గత ఆరు నెలలుగా వార్తా పత్రికల ద్వారా తెలుస్తోందన్నారు. ఆఫ్రీకా దేశం నుంచి నాలుగు చిరుత పులలను దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందే అన్నారు. కోసిగి పరిసరా ప్రాంత కొండలు కొన్నింటిని చిరుత పులల రక్షిత అడవులుగా ప్రకటించి వాటిని సంరక్షించాలని కోరారు.










