Oct 16,2023 16:13
  •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి

ప్రజాశక్తి-కాకినాడ : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యారంగ సమ్యసలు  పరిష్కారం చేయాలని గత నెల 26వ తేదీన ధర్నా చౌక్  వద్ద ధర్నా నిర్వహించి అనంతరం అధికారులకు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. కానీ 20 రోజులు గడిచిన గాని అధికారులు విద్యారంగ సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రభుత్వ విద్యా రంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రభుత్వ విద్యారంగాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని చెప్పినటువంటి పాలకులు నేడు అధికారంలోకీ  వచ్చిన తర్వాత విద్యారంగాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు. కేజీ నుండి పీజీ వరకు అందరికీ ఉచిత విద్య అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాలు నేడు ప్రభుత్వ విద్యారంగాన్ని పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రభుత్వ విద్యా రంగంలో ఉన్న సమస్య పరిష్కారం చేయాలని ప్రభుత్వ విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని భారతి విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈరోజుకి కాకినాడ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో పూర్తిస్థాయిలో అధ్యాపకులు లేరని, మౌళిక సౌకర్యం వంటి రక్షిత మంచినీరు, మరుగుదొడ్లు, ఆటస్థలం, సైకిల్ షెడ్లు అందుబాటులో లేవని అన్నారు. కాకినాడ నగరంలో ఉన్నటువంటి పి.ఆర్ ఓకేషనల్ కళాశాలకు నూతన భవనం నిర్మించాలని, జగ్గంపేట ప్రభుత్వ ఐటిఐ కళాశాలకు స్థలం కేటాయించి భవనం నిర్మించాలని, గొల్లప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు భవనం కేటాయించి నూతన భవనాలు నిర్మించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని సుమారు 46 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పందించి సమస్యలన్నిటిని రాసుకొని వాటిని పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో విద్యార్థులు అందరిని ఐక్యం చేసి మరిన్ని పోరాటాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విద్యా రంగ సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర అధ్యక్షులు సంజయ్, నగర నాయకులు ఆదర్శ కార్తీక్, జయరాం, మేఘన తదితరులు పాల్గొన్నారు.