Apr 21,2023 16:05
  • ఎండాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా
  • ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సర్పంచ్ ..

 ప్రజాశక్తి-విఆర్ పురం : మండలం రామవరం పంచాయతీలోని రామవరంలో ఎండలు ఎక్కువ అవడంతో సర్పంచ్ కారం బుచ్చమ్మ చేతుల మీదుగా చలివేంద్రం ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కారం  బుచ్చమ్మ మాట్లాడుతూ విఆర్ పురం నుండి రామవరం మీదుగా చింతూరు వ్యాపారస్తులు 35 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారని ఎక్కడ నుండో వచ్చి ఇక్కడ సిరి వ్యాపారస్తులు  తిరుగుతుంటున్నారని వారికి ఈ చలివేంద్రం దాహం తీరుస్తుందని గ్రామ ప్రజలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఎండల్లో ఎక్కువగా తిరిగితే శరీరం అలసటతో డీహైడ్రేషన్కు గురువుతారన్నారు. ముఖ్యంగా చర్మ, కళ్ల సమస్యలు అధికంగా వస్తాయని తెలిపారు. తాజా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తాజాగా ఉన్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ రోజుకి 5 నుంచి 6 లీటర్లు కాచి వడపోసిన నీటిని తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. వడదెబ్బ తగలకుండా వీలైనంత వరకు బయట తిరగరాదని, వెళ్లాల్సి వస్తే తలకు టోపి, వస్త్రం ధరించాలన్నారు. రామవరం పంచాయతీ ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో వార్డు నెంబర్ సుధీర్ పంచాయతీ సెక్రెటరీ తాతారావు సచివాలయం సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.