Jul 09,2023 16:38
  • విష జ్వరాలతో ప్రజలు భయాందోళనలు...

ప్రజాశక్తి-పత్తికొండ : పత్తికొండ మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినాయి.  డ్రైనేజ్ కాలవలలో మురికి నీరు నిలవడం వల్ల దుర్వాసన వెదజల్లడంతో, దోమలు ఇళ్లల్లో కోస్తున్నాయనీ, ప్రజలు దోమలు బాబోయ్ దోమలు భయభ్రాంతులకు గురవుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు డ్రైనేజ్ కాలువ లేక ఇంటిముందే మురికి నీరు పారుతున్నాయని కాలనీవాసులు అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనదారులు కాలినడకన వెళ్లేవారు ఇబ్బందులు తప్పడం లేదు. మురికి నీరు నిల్వ చేయడం వల్ల దోమలు  పుట్టి  ఇళ్లల్లోకి ప్రవేశిస్తున్నాయనీ,  అనారోగ్యాలకు గురవుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దోమలు కుట్టడం వల్ల మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ విష జ్వరాలు వస్తాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మండల గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే పంచాయతీ కార్యదర్శులు పట్టించుకోవడం ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారి స్పందించి దోమల మందు  స్ప్రే చేయించాలని పట్టణ గ్రామీణ ప్రజలు కోరుతున్నారు.

  • దోమల మందు స్ప్రే చేయిస్తాం.. : ఎంపీడీవో కవిత

పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా ఉన్నాయి.పంచాయతీ కార్యదర్శులకు చెప్పి దోమల మందు స్ప్రే చేస్తా  ప్రజల ఆరోగ్యాలపై ప్రత్యేక దృష్టి ఉంచుతామని తెలిపారు

  • విష జ్వరాలు వస్తాయని భయాందోళన  : ఆవాజ్ కమిటీ మండల కార్యదర్శి తాజ్ మహమ్మద్

పట్టణ గ్రామీణ ప్రాంతాలలో దోమల బెడద ఎక్కువగా ఉందని దోమల ద్వారా విష జ్వరాలు ప్రబలించే అవకాశం ఉందని ప్రజల అనారోగ్యాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాలపై పంచాయతీ కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  ఉన్నతాధికారులను కోరారు.