.ప్రజాశక్తి-నార్పల : మండల కేంద్రంలోని నార్పల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో విజృంభించిన విష జ్వరాలు అన్న ప్రజాశక్తి కథనానికి స్పందించిన సర్పంచ్ మంజుల సుప్రియ కార్యదర్శి అశ్వత్త నాయుడు ఆదివారం అయినా పంచాయతీ కార్యదర్శి దగ్గరుండి సీజనల్ వ్యాధుల దృశ్య మండల కేంద్రంలోని ఉయ్యాలకుంటవీధి, జంగాల కాలనీ, పాత హాస్పిటల్ వీధి, బాలనాగి వీధి, ఆంజనేయస్వామి గుడి వీధులలో పంచాయతీ కార్మికులతో స్ప్రేయింగ్ చేపించడం జరిగింది ఈ సందర్భంగా కార్యదర్శి అస్వర్త నాయుడు మాట్లాడుతూ ఫాగింగ్ మిషన్లను కూడా త్వరలోనే మరమ్మత్తులు చేయించి మేజర్ పంచాయతీ పరిధిలో అన్ని కాలనీలో రాత్రి సమయంలో ఫాగింగ్ కూడా చేయిస్తామని తెలిపారు.. అదేవిధంగా మండల పరిధిలోని సీజనల్ వ్యాధులు అధికంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో కూడా స్ప్రేయింగ్ చేయించి మరుగు నీరు ఉన్న ప్రాంతాల్లో బీసీ పౌడర్ చెల్లించి సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో వైద్య సిబ్బందితో మాట్లాడి వైద్య శిబిరాలు కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీడీవో దివాకర్ ఈవో ఆర్డి లక్ష్మీనరసింహ తెలిపారు...










