ప్రజాశక్తి-యు.కొత్తపల్లి(కాకినాడ) : నాగులపల్లి సొసైటీ ద్వారా రెండు కోట్ల రూపాయలను రైతు నేస్తం రుణాల కింద 19 మంది రైతులకు అందువడం జరిగిందని సొసైటీ అధ్యక్షులు అబిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతు నేస్తం ప్రవేశపెట్టిన రుణ విధానంలో అందువడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు మాట్లాడుతూ నాగులపల్లి సొసైటీ పయనిస్తుందని అలాగే ఈరోజు ఇచ్చిన రుణములతో కలిసి 18 కోట్ల 50 లక్షల రూపాయలు రైతులకు అందడం జరిగిందన్నారు. ఈ ఏడాది లాభాల కంపెనీలో రైతుల షేర్ దానం ఐదు శాతం డివిడెంటిను రైతు ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి అలాగే ఇతర అవసరాలకు అనుగుణంగా అవసరమైన అప్పులను జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సహాయంతో ఈ సొమ్మును సకాలంలో అందజేయడం జరుగుతుందని, రైతు నేస్తంతో అప్పులు పొందిన రైతులు 10 సంవత్సరాలలో 10 సమాన వాయిదాలతో చెల్లించాలని కావాల్సి రైతులందరికీ ఇవ్వగలమని తెలియజేశారు. ఈ సందర్భంగా సొసైటీ అభివృద్ధికి సహకరిస్తున్న పిఠాపురం ఎమ్మెల్యే పిండం దొరబాబుకి, జిల్లా కేంద్ర సహకారభ్యాంక్ చైర్మన్ ఆకుల వీర్రాజు, బ్యాంకు సీఈఓ సిహెచ్ నరసింహారావు అలాగే బ్యాంకు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు కాజులూరి నేరెళ్ల రెడ్డి, గుర్రాల చిన్నబ్బాయి, సంఘం పరిధిలోని రైతులు సొసైటీ సీఈవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










