Oct 19,2023 10:27

ప్రజాశక్తి-పిడుగురాళ్ల : హయ్యర్ బస్ డ్రైవర్ను ఓనర్ అసభ్యంగా తిట్టడంతో సర్వీసులు నిలిపివేసి డ్రైవర్లు నిరసన వ్యక్తం చేశారు. దీంతో 18 బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. బస్సు ఓనర్ వచ్చి తమకు క్షమాపణ చెప్పేంతవరకు సర్వీసులు నిలిపివేస్తామని డ్రైవర్లు తెలిపారు. పండగ సీజన్ లో సర్వీసులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి ఎటువంటి భరోసా లేకుండా విధులు నిర్వహిస్తున్న తమను చిన్నచూపు చూస్తున్నారంటూ డ్రైవర్ల ఆవేదన వ్యక్తం చేశారు. పిడుగురాళ్ల డిపో మేనేజర్ మరియు పోలీసులు డ్రైవర్లతో సమావేశమై చర్చిస్తున్నారు.