ప్రజాశక్తి-ఏలేశ్వరం : ఏజెన్సీ మాకు దూరమైన ఏలేశ్వరం మండలంలోని రమణయ్యపేట- జై అన్నవరం రహదారి శిధిలావస్థకు చేరుకోవడంతో ప్రయాణం కష్టతరంగా మారింది. ఏజెన్సీ ప్రాంతమైన అడ్డతీగల, రాజ ఒమ్మంగి, వైరామవరం, గంగవరం మండలాల గిరిజనులు మైదాన ప్రాంతాలకు వెళ్లాలంటే ఏలేశ్వరం రావాల్సిందే. గిరిజన ప్రాంతాల నుండి వచ్చే జన్మ రహదారి చిన్నబిర్ణం కావడంతో ప్రతిరోజు ఏదో వాహనం మరమ్మతులు తప్పడం లేదు. గిరిజన ప్రాంతాలలోని ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం నిమిత్తం ఏలేశ్వరం ప్రత్తిపాడు కాకినాడ వంటి ప్రాంతాలకు గిరిజనులను అనునిత్యం అంబులెన్స్ ల ద్వారా తరలిస్తుంటారు. రహదారి చిన్నబిన్నం కావడంతో అంబులెన్సులు కూడా రావడం ఇబ్బందికరంగా మారింది. ప్రతిరోజు ఏదో వాహనం మరమ్మతు రావడం, దిగబడిపోవడంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికైనా రహదారి నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగించి నిర్మాణాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.










