ప్రజాశక్తి-గాజువాక : ద్విచక్రవాహనంని లారీ ఢీకొట్టడంతో ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. మృతులు జెర్రిపోతుల శ్రావణి లక్ష్మి (31), పేడిశెట్టి సొంతోషి(26) ఇద్దరు మహిళలు ద్విచక్రవాహనం మీద సింహచలం నుండి పరవాడ ఇంటికి వెల్తున్న సమయంలో విశాఖ డైరీ వద్ద ఐస్ క్రీమ్ తిని బండి తీస్తుండగా, అతివేగం వస్తున్న లారీ ఢీకొనడంతో ఇద్దరు మహిళలు అక్కిడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన గాజువాక పోలీసులు దర్యాప్తు చేపట్టారు.










