Oct 18,2023 16:12

ప్రజాశక్తి - పెద్దాపురం : స్థానిక సీతారాముడు స్మశానం ఆవరణలో రూ 3 లక్షల వ్యయంతో సిమెంటు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు.బుధవారం ఈ పనులను పర్యవేక్షిస్తున్న కౌన్సిల్ కో-ఆప్షన్ సభ్యుడు వాసంశెట్టి గంగ మాట్లాడుతూ స్మశానంలో రహదారులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా రహదారుల నిర్మాణానికి రూ. మూడు లక్షలు నిధులు మంజూరు చేశారన్నారు. ఈ రహదారుల నిర్మాణం వల్ల స్మశానంలో ప్రజలు ఇబ్బందులు లేకుండా నడువగలుగుతారన్నారు.