Oct 21,2023 15:26

ప్రజాశక్తి-రొద్దం(అనంతపురం) : రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు. మండలంలోని పెనుకొండ పావగడ ప్రధాన రహదారిలో కర్ణాటక సరిహద్దులో మండల కేంద్రంలోని సానిపల్లి గ్రామానికి చెందిన ఈడిగ శ్రీరాములు శనివారం పనినిమిత్తం పావగడకు వెళ్తున్నారు. అయితే పావగడ వైపు నుంచి పెనుకొండకు వెళ్తున్న పెనుకొండ టాటా ఏసీ ఎదురుగా రావడంతో అదుపుతప్పి ఒకటి ఒక్కటి డికొన్నారు. దీంతో సూపర్ ఎక్సెల్ ఉన్న శ్రీరాములు కు కుడికాలు విరిగింది.  విషయం తెలుసుకొన్న తెలుగుదేశం పార్టీ నాయకులు హరీష్ అక్కడ చేరుకొని పరిశీలించి 108కు ఫోన్ చేశారు. అనంతరం పోలీసులు అక్కడ చేరుకొన్నారు.  అంబులెన్స్ రావడంతో అతనిని పెనుకొండ కు తరలించారు.