Nov 28,2022 15:48

ప్రజాశక్తి-విశాఖ : అప్పన్న దేవస్థానం వచ్చిన కాశిబాబు (60), అమ్మాజీ (48) దర్శనం అనంతరం కొండ దిగువకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎన్టీఆర్ ఘాట్ మలుపు వద్ద ప్రమాదవశాత్తు లోయల పడి తీవ్ర గాయాలు పాలయ్యారు. వారి బంధువులు స్థానికుల సమాచారం మేరకు దేవస్థానం అంబులెన్సులు స్థానిక సింహాచల గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. కాశి బాబుకు తలకు తీవ్ర గాయం కావడంతో ప్రధమ చికిత్స చేశారు. అమ్మాజీకి ఎడమ కాలు విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రమాద విషయాలు తెలుసుకున్న దేవస్థానం ఈవో త్రినాధ రావు ఈ ఈ శ్రీనివాసరాజు లు సంఘటన స్థలాన్ని పరిశీలించి అనంతరం గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి చేరుకొని బాధితులను పరామర్శించారు.