ప్రజాశక్తి-తెనాలి : తల్లి కొడుకులు బైక్ పై వెళుతుండగా, వెనకనుంచి లారీ ఇంటికొనడంతో తల్లి మృతి చెందగా కొడుకు గాయాలయ్యాయి. పెదకాకాని మండలం వెంకట కృష్ణాపురం గ్రామానికి చెందిన అమ్మిశెట్టి అనురాధ (44) ఆదివారం కుమారుడితో కలిసి బైక్ పై కొలకలూరు బయలుదేరింది. హాఫ్ పేట పరిధిలోకి రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ బైక్ను బలంగా ఢీ కొట్టింది. కింద పడిన అనురాధ కాళ్ళ మీదకి లారీ ఎక్కడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. గాయపడిన కుమారుడిని స్థానికులు చికిత్స నిమిత్తం తరలించారు. తెనాలి రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.










