ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వినుకొండ నియోజకవర్గం శావల్యపురం గ్రామంలో ఎదురు మదురుగా రెండు డీసీఎం మినీ లారీలు ఢీ కొన్నాయి. వినుకొండ నుండి ఎండు మిరపకాయ లోడుతో గుంటూరు వెళ్తున్న లారీ, గుంటూరు నుండి కూరగాయల లోడుతో వస్తున్న మరో లారీ ఢీ కొని ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ డ్రైవర్ కు కాలు విరగటంతో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించించారు. మరో డ్రైవర్ కి చిరు గాయలతో బయటపడ్డాడు. పూర్తి వివరాలు తెలియాలిసి ఉంది.










