ప్రజాశక్తి-జి.కొండూరు(ఎన్టీఆర్ జిల్లా) : మండలంలోని గురాజుపాలెం వద్ద హైవేపై వాహన ప్రమాదం జరిగింది. లారీని దాటవేసే ప్రయత్నంలో బస్సును ద్విచక్ర వాహనదారుడు ఢీ కొట్టాడు. శబరిమలై నుండి తెలంగాణ రాష్ట్రం వి.యం బంజర వెళుతున్న బస్సును ఢీ కొట్టిన ద్విచక్ర వాహనదారుడు మైలవరం సూరిబాబు పేటకు చెందిన కటారి వెంకటేశ్వరరావు (35)గా గుర్తించారు. సంఘటనా స్థలంలోనే వెంకటేశ్వరరావు మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకుని జి.కొండూరు ఎస్ఐ ధర్మరాజు విచారణ జరుగుతున్నారు.










