ప్రజాశక్తి-ఏలేశ్వరం : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన ఏలేశ్వరం నగర నడిబొడ్డున శనివారం చోటుచేసుకుంది. ఈ మేరకు ఏలేశ్వరం ఎస్ ఐ జి సతీష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏలేశ్వరం లింగవరం కాలనీకి చెందిన వెంగళ నాగలక్ష్మి (28) నిత్యవసరాలు తీసుకునేందుకు ఇంటి నుండి తన స్కూటీ పై బయలుదేరింది. లారీ యూనియన్ ఆఫీస్ వద్దకు వచ్చేసరికి జగ్గంపేట నుండి ఏలేశ్వరం మీదుగా కిమ్మూరు వెళుతున్న లారీ ఆమెను బలంగా ఢీకొట్టింది. దీంతో నాగలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త వెంగళ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతురాలికి 14 సంవత్సరాల సాయి తేజ, 12 సంవత్సరాల నాగేంద్ర అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె వృత్తితో లింగవరం కాలనీలో విషాద చాయలు అలుగుతున్నాయి.










