ప్రజాశక్తి-ఏలేశ్వరం : కౌన్సిల్లో మహిళ కౌన్సిలర్లు గౌరవించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్పర్సన్ అలమండ సత్యవతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిలర్ సామంతుల హైమావతి మాట్లాడుతూ గత సమావేశాల్లో మగ కౌన్సిలర్ రోడ్డు ఆక్రమణల తొలగింపు విషయంలో మహిళా కౌన్సిలర్లపై చెయ్యెత్తి మాట్లాడారని, అప్పటికే గౌరవ ఏర్పర్సన్ సమావేశం నుండి వెళ్లిపోయినందున ఆ విషయాన్ని చర్చించాలని డిమాండ్ చేశారు. దుకాణాలు తొలగించిన ప్రాంతంలో కోర్టుకు వెళ్ళని వారికి న్యాయం చేయాలని వారు కోరారు. అనంతరం చైర్పర్సన్ అలమండ సత్యవతి మాట్లాడుతూ వాసవి దృశ్య మంచినీటి సరఫరాకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో వైస్ చైర్ పర్సన్లు శిడగం త్రివేణి, మాసారపు బుజ్జి, కౌన్సిలర్లు అలమండ చలమయ్య, ఎండగుండి నాగబాబు, రాయుడు చిన్న, పెండ్ర శ్రీను, కమిషనర్ సిబ్బంది ఉన్నారు.










