Nov 20,2022 15:19

ప్రజాశక్తి - భవానీపురం : సిపిఎం 45వ డివిజన్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు సంతాప సభ ఈరోజు ఉదయం లేబర్ కాలనీ వారి నివాసం వద్ద నిర్వహించడం జరిగింది. సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి బోయి సత్యబాబు మాట్లాడుతూ పార్టీ ప్రజా ఉద్యమాలకు లేబర్ కాలనీ 44,45 డివిజన్ ప్రజాసమస్యలు పరిష్కారంలో చురుగ్గా పాల్గొని కృషి చేశారని కొనియాడారు. ఆర్టీసీ కార్మికులుగా పనిచేస్తూ వారి హక్కుల కోసం పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు. ఈ సంతాప సభలో సిఐటియు పశ్చిమ నగర అధ్యక్షులు ఈ వి నారాయణ, ఐద్వా నగర అధ్యక్షురాలు కె శేషు మణి, మోటో వర్కర్స్ యూనియన్ నగర సహాయ కార్యదర్శి జి వెంకట్రావు, 45 డివిజన్ కార్యదర్శి ఏ శ్రీనివాస్, 44 డివిజన్ సీనియర్ నాయకులు పుల్లారావు, కెవిపిఎస్ నాయకులు సుదర్శన్, 43వ డివిజన్ సిపిఎం నాయకులు ఎస్కే మస్తాన్, విక్రం లక్ష్మి, సుకుంద, అప్పలరాజు కాంతారావు తదితరులు పాల్గొన్నారు.