ప్రజాశక్తి-రొద్దం : తడి పంటగా మారిన కందిపంట. తీవ్ర వర్ష భావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురవక వివిధ పంటలు ఎండు ముఖం పట్టయీ అయితే రైతు మాత్ర తన శ్రమనే నమ్ముకొని జీవిస్తున్నందున ఎండిన పంటలు ఇలా కాపాడుకోవాలో తిలియక నానా అవస్తలు పడుతున్నారు. ఇందులో భాగంగా మండలంలోని వివిధ గ్రామాలలో ముక్యంగా కంది రైతు కష్టం చెప్పలేనంత పడుతున్నారు. రొద్దం గ్రామానికి చెందిన ఇస్మాయిల్ తనకున్న 3ఎకరాలు పొలంలో కంది వేశారు. అయితే వర్షం లేక పోవడంతో పంట ఎండుతున్నది. అయినా కూడా రైతు కుంగిపోకుండా కంది సాళ్లకు కాలువలు చేసి పక్కన ఉన్న మరొక్క రైతు బోరులో నీటిని పైపులు ద్వారా పంటకు అందింస్తున్నాడు. అయితే అందుబాటులో ఉన్న రైతు అయితే ఆలా చేస్తున్నారు. మరికొంతమంది ట్యాంకర్ల ద్వారా కాపాడుకొంటున్నారు. ఏమి ఆధారం లేని వారి పరిస్థితి ఏంటి అని పలువురు వాపోతున్నారు.










