నదిలా సాగిపోదాం
సముద్రంలా ఉప్పొంగుదాం
గాలిలా చెలరేగుదాం
అగ్నిలా రగులుదాం
తోకచుక్కలా మీద పడదాం
లావాలా ఉబికివద్దాం
ఇక లాభం లేదు
భరతమాతకు
మళ్ళీ సంకెళ్ళు పడ్డాయి
ఆమె నగలూ నట్రా మీదా
దుర్మార్గుల కళ్ళు పడ్డాయి
ఆమె చీరను లాగే
దుశ్శాసనులు బయలుదేరారు
అవినీతిపరులు
భరతమాత సర్వస్వాన్ని దోస్తూ
నిరాధారను చేస్తున్నారు
అవి సాధారణ
నీటిప్రవాహాలు కాదు
ఆమె కన్నీటి ప్రవాహాలు
సమయం ఆసన్నమైంది
తూర్పు పొత్తిళ్ళలో
సూర్యుడు ఎర్రరంగు
పులుముకొంటున్నాడు
ఆ రంగు వెంటే
మనమూ అడుగులేద్దాం
ఎరుపంటే త్యాగానికి
చిహ్నమని నిరూపిద్దాం
మంకుశ్రీను
89859 90215