Feb 08,2023 12:29

న్యూఢిల్లీ   :  రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) వడ్డీరేట్లను మరోసారి పెంచింది. రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచడంతో కీలక వడ్డీ రేట్లు 6.5 శాతానికి చేరుకొన్నాయి. గత ఏడాది మే నుంచి 225 బేసిస్‌ పాయింట్లు రెపో రేటు పెంచిన ఆర్‌బిఐ తాజాగా మరో 25 బేసిస్‌ పాయింట్లు పెంచడం ద్వారా 6.5 శాతానికి చేర్చింది. 2023లో ఇదే తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్ష. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను బుధవారం ఆర్‌బిఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ప్రకటించారు. ఫిబ్రవరి 6వ తేదీ నుండి ఆర్‌బిఐ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షా సమావేశాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని మానిటరీ పాలసీ కమిటీలోని ఆరుగురు సభ్యుల్లో నలుగురు ఆమోదించినట్లు తెలిపారు. రేటు నిర్ణయం తర్వాత అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి స్వల్పంగా పెరిగింందని అన్నారు.
ఫిబ్రవరి 1న ఫెడరల్‌ బడ్జెట్‌కు ముందు నిర్వహించిన పోల్‌లో, 52 మందిలో 40 మంది ఆర్థికవేత్తలలో మూడొంతుల మంది ఆర్‌బిఐ రెపోరేటును 25 బేసిన్‌పాయింట్లు పెంచుతుందని అంచనా వేయగా, మిగిలిన 12 మంది ఎలాంటి మార్పు ఉండబోదని అంచనావేశారు. 2023 ఆర్థిక సంవత్సరం జిడిపి వఅద్ధిరేటు 7శాతంగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనావేశారు.