Dec 06,2020 00:00

ప్రత్యేక ప్రతినిధి : దేశవ్యాప్తంగా పేద ప్రజానీకం అప్పుల వలలో చిక్కుకుంటున్నారు. ఏటికేడాది రుణగ్రస్తులవుతున్న పేదల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి, ఏ మాత్రం ముందస్తు ప్రణాళిక లేని లాక్‌డౌన్‌ కారణంగా ఈ పరిస్థితి మరింత తీవ్రమైంది. చేయడానికి పనిలేకపోవడంతో పెద్దసంఖ్యలో పేదలు అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో మైక్రోఫైనాన్స్‌ సంస్థల మందు చేయిచాచాల్సివచ్చింది. దీనికి తగ్గట్టే మైక్రో సంస్థల వ్యాపారం గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే అదనంగా 4.23 కోట్ల మంది ప్రజలు ఈ ఏడాది జులై నాటికి మైక్రో ఫైనాన్స్‌ సంస్థల నుండి రుణం తీసుకున్నారు. దీంతో కరోనా కష్టకాలంలో దేశ వ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్‌ సంస్థల వ్యాపారం గణనీయంగా పెరిగింది. నాబార్డ్‌ సహకారంతో కమ్యూనిటి డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అసోసియేషన్‌ 'సాాధన్‌' రూపొందించిన 'భారత్‌ మైక్రోఫైనాన్స్‌ రిపోర్ట్‌ ా 2020' ఈ విషయాన్ని నిర్ధారించింది. ఈ నివేదిక ప్రకారం 2019వ సంవత్సరంలో 4.29 కోట్ల మంది కొత్తవారికి మైక్రోఫైనాన్స్‌ సంస్థలు దేశ వ్యాప్తంగా రుణాలు ఇవ్వగా, ఈ ఏడాది జులైనాటికే కొత్తగా రుణాలు తీసుకున్న వారి సంఖ్య 4.23 కోట్లకు చేరింది. దీంతో సంవత్సరాంతానికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 2018లో 3.51 కోట్ల మందికి కొత్తగా రుణాలు తీసుకోగా, 2019లో ఆ సంఖ్య 4.29 కోట్లమందికి, ఈ ఏడాది కనీసం 6 నుండి 8 కోట్లకు చేరుకుంటుందని అంచనా! అయితే, లాక్‌డౌన్‌ ప్రభావం ఇంకా కొనసాగుతుండటం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయిన వారు అనేకమంది ఇంకా ఖాళీగానే ఉండటంతో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉందని భావిస్తున్నారు. దీనికి తగ్గట్టే గతేడాదికన్నా రెరడు వేల శాఖలు ఈ ఏడాది జులై నాటికి పెరిగాయి. ఆ తరువాత కూడా పెరగుదల కొనసాగుతోంది. తమిళనాడులో అత్యధికంగా 2,360 శాఖలు ఉన్నాయి. ఈ ఏడాది జులై వరకు మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు రూ.1,01,663 కోట్ల రుణాలు ఇచ్చాయి. ఒక పెద్ద బ్యారకు కూడా ఇరత రుణం ఇచ్చి ఉండదని అర్థికనిపుణుల విశ్లేషణ. 2011లో 24 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరగ్గా, గతేడాదికి 94 వేల కోట్ల రూపాయలకు చేరింది. ఈ ఏడాది జులైనాటికి ఆ మొత్తానికి అదనంగా ఏడు వేల కోట్ల రూపాయల రుణాలను మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు ఇచ్చాయి. ఇరదులో క్షేత్ర ధర్మస్థల, స్పందన స్పూర్తి, ముథూట్‌, అన్నపూర్ణ ఫైనాన్స్‌ వంటి పది పెద్ద సంస్థలే ఏకంగా 61,900 కోట్ల రుణాలు ఇచ్చాయి,

తెలుగు రాష్ట్రాల్లో ఇలా....
తెలుగు రాష్ట్రాలోనూ ఈ ఏడాది పెద్ద సంఖ్యలో మైక్రో ఫైనాన్స్‌ సంస్థల ద్వారా రుణాలు తీసుకురటున్న వారిలో తెలుగు రాష్ట్రాలే కీలకంగా ఉన్నాయి. గతేడాదికన్నా ఈ ఏడాది రుణాలు తీసుకున్నవారు తెలంగాణలో 107 శాతం పెరగ్గా, ఆరధ్రప్రదేశ్‌లో 94 శాతం మంది కొత్తగా రుణాలు తీసుకున్నారు. ఎపిలో గత ఏడాది 1.33 లక్షల మంది రుణాలు తీసుకోగా, ఈ ఏడాది జులై నాటికి ఆ సంఖ్య 2.57 లక్షలకు చేరుకోవడం గమనార్హం.