Nov 04,2023 10:28
  • భారీగా రుణ వ్యాపారం
  • రాష్ట్రంలో ఏడాది కాలంలో 46 శాతం అదనం

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : దేశ వ్యాప్తంగా సామాన్య ప్రజానీకానికి రుణ అవసరాలు తీర్చుకోవడానికి మైక్రో ఫైనాన్స్‌ సంస్థలే దిక్కుగా మారుతున్నాయి. బ్యాంకులతోపాటు, ఇతర ఆర్థిక సంస్థల నుండి రుణం పొందడం కష్టంగా మారడంతో పెద్ద సంఖ్యలో ప్రజానీకం ఈ సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్పొరేట్లకు, పలుకుబడి ఉన్న వ్యక్తులకు అప్పులు ఇవ్వడానికి చూపే ఆసక్తి సాధారణ ప్రజల పట్ల బ్యాంకులు చూపకపోవడం ఈ పరిస్థితికి కారణం. ప్రముఖ ఆర్థిక విశ్లేషణ సంస్థ సా-ధన్‌ ఈ ఏడాది ద్వితీయ త్రైమాసిక నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా గత ఏడాది తో పోలిస్తేతో ఈ ఏడాది జూన్‌నాటికి 20.98శాతం ఎక్కువగా మైక్రోఫైనాన్స్‌ వ్యాపారం సాగింది. ప్రస్తుతం 2.41 కోట్ల మైక్రో ఫైనాన్స్‌ రుణ ఖాతాలు ఉన్నట్లు తేలింది. వీటిద్వారా రూ.3,58,700 కోట్ల రుణం ఉన్నట్లు నిర్ధారించారు. తెలుగు రాష్ట్రాల్లో పెద్దఎత్తున మైక్రో ఫైనాన్స్‌ వ్యాపారం సాగుతోంది. గత ఏడాదిలో పోలిస్తే రాష్ట్రంలో ఈ సంవత్సరం 46 శాతం రుణగ్రస్తుల ఖాతాలు పెరిగాయి. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా ఈ పరిస్థితి ఏర్పడటం గమనార్హం. రాష్ట్రంలో గత ఏడాది జూన్‌ నాటికి 6.96 లక్షల రుణ ఖాతాలు ఉండగా, ఈ ఏడాదికి 10.18 లక్షలకు ఖాతాలు పెరిగాయి. గత ఏడాది జూన్‌ నాటికి రాష్ట్రంలో రూ.8,167 కోట్ల రుణం ఉండగా, ఈ సంవత్సరం ఆ మొత్తం రూ.12,875 కోట్లకు చేరింది. తెలంగాణలో గతేడాది రూ.1,288 కోట్లుగా ఉన్న రుణం ఈ ఏడాది జూన్‌ నాటికి రూ.1,778 కోట్లకు.. అంటే 38 శాతం పెరిగినట్లు సా-ధన్‌ వెల్లడిరచిరది. మైక్రో ఫైనాన్స్‌ రుణ ఖాతాల్లో అగ్రస్థానంలో ఉన్న బీహార్‌లో గతేడాది 1.50 కోట్ల రుణ ఖాతాలు ఉరడగా, ఈ ఏడాది జూన్‌ నాటికి 28 శాతం పెరుగుదలతో 1.93 కోట్లకు చేరుకురది. తరువాత స్థానాల్లో తమిళనాడు (1.86 కోట్లు), ఉత్తరప్రదేశ్‌ (1.36 కోట్లు), కర్ణాటక (1.24 కోట్లు), పశ్చిమ బెరగాల్‌ (1.21 కోట్లు), మహారాష్ట్ర (1.17 కోట్లు) ఉన్నాయి.