Aug 05,2023 11:48

న్యూఢిల్లీ : దేశంలో ఉన్న పోలీస్‌ స్టేషన్లలో మరణాలకు సంబంధించిన వివరాలను కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. గత ఐదేళ్లకు చెందిన వివరాలను వెల్లడించింది. ఈ మరణాల్లో గుజరాత్‌ అగ్రస్థానంలో నిలిచింది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ వివరాల మేరకు.. 2018 నుంచి 2023 మార్చి 31 వరకు నమోదైన వివరాలను కేంద్రం తెలిపింది. ఈ వివరాల ప్రకారం గత ఐదేళ్లల్లో గుజరాత్‌లో 81, మహారాష్ట్రలో 80, మధ్య ప్రదేశ్‌లో 50, బిహార్‌లో 47, ఉత్తరప్రదేశ్‌లో 41, పశ్చిమ బెంగాల్‌లో 40 మరణాలు సంభవించాయి. ఇక దక్షిణ రాష్ట్రాల విషాయానికొస్తే.. మొదటిస్థానంలో తమిళనాడు ఉంది. ఆ రాష్ట్రంలో 2018-19లో 11, 2019-20లో 12, 2020-21లో 2, 2021-22లో 4, 2022-23లో 7.. మొత్తం కలిపి ఇప్పటి వరకు 36 లాకప్‌ డెత్‌లు నమోదయ్యాయి.