ప్రజాశక్తి-భవనిపురం : బడుగు బలహీనవర్గాల ఆశ్యాజ్యోతి వంగవీటి మోహన్ రంగ 34 వ వర్ధంతి సందర్భంగా సోమవారం నాడు స్థానిక విద్యాధర పురం చెరువు సెంటర్ వద్ద గల రంగా విగ్రహం వద్ద మైలవరపు దుర్గారావు,రత్నకుమారి అధ్వర్యంలో రంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు వెలంపల్లి పాల్గొని రంగా విగ్రహానికి పూలమాల వేసి పేదలకు పండ్ల పంపిణీ చేశారు అనంతరం చిట్టినగర్ కుండల మార్కెట్ వద్ద సింహాచలం దేవస్థాన ట్రస్ట్ బోర్డ్ సభ్యులు కురాకుల నాగ అధ్వర్యంలో రంగా కార్యక్రమం చేశారు వెలంపల్లి పాల్గొని రంగా చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు.










