- భవిష్యత్తులో బహుజనులదే రాజ్యాధకారo
ప్రజాశక్తి-తుగ్గలి : రానున్న రోజుల్లో బహుజనులదే రాజ్యాధకారామని బీసీలు జాతీయ నాయకులు రామచంద్ర యాదవ్ ధీమా వెక్తం చేశారు. బుధవారం సాయంత్రం సీనియర్ జర్నలిస్టు ఆర్.కౌలుట్ల యాదవ్ నివాసగృహంలో విలేకర్ల సమావేశము జరిగింది. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయాలు చూస్తుంటే చాలాబాధాకరం అన్నారు. ముఖ్యంగా అట్టడుగు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారికి ప్రభుత్వ పలాలు నిజాయతీగా అందంటం లేదని, అన్నింటిలో రాజకీయాలు జోక్యం రాజ్యమేలుతుంది దుయ్యబట్టారు. అధికార పార్టీ ఆగడాలు రోజు, రోజుకి మితిమీరి పోతున్నయన్నారు. సామాన్యులకు భద్రత లేకుండా పోయిందని, బలహీన వర్గాల్లో ఆశలు ఆవిరయ్యాయి అన్నారు. అన్ని వర్గాలవారు, అన్ని రంగాల్లో రానిచేవారికి, రైతులకు, సామాన్యులకు అందుబాటులో రాజికీయాలు ఉండేవిధంగా మరో కొత్త పార్టీ ఈనెల 23న కొత్త పార్టీ ఆవిష్కరించనున్నారు. పార్టీ ఆవిర్భాంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా యంఈ యాప్ రాష్ట్ర కన్వీనర్ శ్రీరాములు, నాగర్జున యూనివర్సిటీ జేఏ రాష్ట్ర ఛైర్మెన్ రాజన్న,ఎమ్మార్పీఎస్,రాష్ట్ర కన్వీనర్ వెంకటేశ్వర్లు, నంద్యాల జిల్లా కన్వీనర్ రాజు, జిల్లా అధ్యక్షులు చిన్న ఆంజనేయలు కలిసి రామచంద్ర యాదవ్ కు మద్దతుగా 23న పార్టీ ఆవిర్భావం గురించి చర్చించారు. అంతే కాకుండా వారు రామచంద్ర యాదవ్ కు సంపూర్ణంగా మద్దతుగా ప్రకటించారు. ఈ సమావేశంలో ఆర్కె,కరుణాకర్ యాదవ్, కళ్యాణ్, సంజీవ్ కుమార్, మరెళ్ళ శంకర్ తదతరులు పాల్గొన్నారు.










