May 29,2023 16:25

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్ : లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్య తీసుకోమంటే మహిళా రేజ్లర్ల అక్రమ అరెస్టులను ఖండించాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రభాకర్ రెడ్డి అన్నారు. సోమవారం కర్నూల్ నగరంలోని సుందరయ్య జంక్షన్ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి 30 రోజుల నుండి లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ  రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన తెలుపుతున్న రెజ్లార్ల క్రీడాకారుల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణ అధ్యక్షతన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ దేశ రాజధాని నడిబొడ్డులో 30 రోజుల నుండి ప్రపంచ వేదికపై భారత కీర్తిని పెంచే రెజ్లార్ల క్రీడాకారులపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ పై చర్య తీసుకోవాలని కోరుతూ నిరసన తెలియజేసిన నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించబడే పార్లమెంటు ప్రారంభోత్సవం సందర్భంగా రెజ్లర్లకు న్యాయం చేయమని కోరుతూ శాంతియుత నిరసన ర్యాలీ చేస్తామంటే వేధింపులకు పాల్పడిన వారిని వదిలేసి లైంగిక వేధింపులకు గురైన వారిని వారికి మద్దతుగా నిలిచిన క్రీడాకారులను అక్రమంగా అరెస్టు చేశారని తెలిపారు. ప్రజాస్వామ్య వాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేసిన మహిళ క్రీడాకారులకు న్యాయం చేయలేని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇంకెవరికి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. తక్షణమే మహిళా రెజ్లర్ల క్రీడాకారులపై అత్యాచారానికి పాల్పడ్డా బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా సంఘాలన్నీ కలిసి క్రీడాకారులకు మద్దతుగా ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా ఓల్డ్ సిటీ న్యూ సిటీ అధ్యక్షులు రసీదా, ధనలక్ష్మి డివైఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి శిరీష జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాఘవేంద్ర నగేష్ అసలు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వెంకటరాముడు, సిఐటియు ఓల్డ్ సిటీ, న్యూ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు అబ్దుల్ దేశాయ్ నరసింహులు, విజయ్ సాయిబాబా సిఐటియు జిల్లా నాయకులు రాముడు, రాజశేఖర్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, ఆవాజ్ జిల్లా కార్యదర్శి ఎస్.ఏ సుభాన్, రైతు సంఘం నాయకులు ఆంజనేయులు, మోటర్ వర్కర్స్ యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.