ప్రజాశక్తి-సింహాద్రిపురం : మండలంలోని బి దినం చెర్ల గ్రామ సమీపంలోని వెలిదండ్ల... సింహాద్రిపురం రోడ్డులోని మురుగునీరు నిలువ ఉండే ప్రాంతాన్ని అధికారులు మరమ్మతు చేశారు. ఈనెల 24న ప్రజాశక్తిలో వంకను తలపిస్తున్న రోడ్డు అనే కథనం ప్రచురితం కావడం జరిగింది. దీంతో అధికారులు స్పందించి నీరు నిలువ ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి మీరు నిలువ లేకుండా రోడ్డు ప్రక్కన చిన్న కాలువను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. దీంతో నీరు లేకుండా ఉంది. నీరు నిలువ లేకపోవడంతో వాహనదారులు ప్రజలు ఇలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు చేస్తున్నారు. రోడ్డు మరమ్మత్తు చేయడం పట్ల స్థానికులు ప్రజలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.










