అమరావతి : ఎపిలో రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో 539 పంచాయతీలు ఏకగ్రీవాలు అయినట్లు ఎస్‌ఇసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 167 మండలాల పరిధిలోని 3,328 గ్రామ పంచాయతీల్లో రెండో దశ ఎన్నికలకు ఎస్‌ఇసి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వీటిలో అన్ని జిల్లాల్లో కలిపి ఏకగ్రీవాలు పోగా మిగతా 2,786 పంచాయతీల్లో ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా.. గుంటూరు జిల్లాలో 70, ప్రకాశం 69, చిత్తూరు 62, విజయనగరం 60, కర్నూలు 57, శ్రీకాకుళం 41, కడప 40, కృష్ణా 36, నెల్లూరు 35, విశాఖ 22, తూర్పు గోదావరి 17, పశ్చిమ గోదావరి 15, అనంతపురం జిల్లలో 15 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.










