అమరావతి : పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగడం లేదు అని టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు. ఎపిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తీరుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, రాష్ట్రపతికి చంద్రబాబు లేఖ రాశారు. కేంద్ర బలగాలతో ఎన్నికలను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల కమిషన్కు అధికారాలున్నప్పటికీ... ఆ అధికారాలను అమలు చేయలేకపోయిందని చంద్రబాబు ఆరోపించారు. అన్ని విధాలా స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఫెయిల్ అయిందన్నారు. కనీసం స్వేచ్ఛగా ఓటు వేసుకునే హక్కు ఓటరుకు లేదా ? పోటీ చేసే హక్కు ప్రజలకు లేదా ? అని ప్రశ్నించారు. అధికార పార్టీ బలవంతంగా ఏకగ్రీవాలు చేస్తోందని, ఉద్యోగులు, పోలీసులు, వ్యవస్థలను పూర్తిగా తమ కనుసన్నల్లో పనిచేసేలా అధికారదుర్వినియోగానికి పాల్పడుతోందంటూ మండిపడ్డారు. ఎన్నికల అక్రమాలు, బెదిరింపులపై అనేకసార్లు ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా, ప్రయోజనం లేకపోయిందని తక్షణమే చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.










