ప్రజాశక్తి-రెడ్డిగూడెం : మండల పరిషత్ కార్యాలయం నందు డ్వాక్రా మహిళలకు కోళ్లను పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మహిళల యొక్క సాధికారత, జీవనోపాధిని మెరుగుపరచుటకు మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు పెరటి కోళ్ల పెంపకం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అని తెలిపినారు. ఈరోజు మండలంలో వివిధ గ్రామాలలో 100 మంది లబ్ధిదారులకు పెరటి కోళ్ల పంపిణీ కార్యక్రమం జరిగినది. ఒక్కొక్క యూనిట్కు ఎనిమిది పెట్టలు మూడు పుంజులు మొత్తం 11 కోళ్లు,50 కిలోలు దాణ, మెడికల్ కిట్ పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాబర్ట్ ,రెడ్డిగూడెం ఎంపీటీసీ సభ్యులు కుప్పిరెడ్డి వరప్రసాద్ రెడ్డి,రామినేని వీరాస్వామి నాయుడు ,సీనియర్ నాయకులు పాటిబండ్ల సత్యం,సచివాలయల కన్వీనర్ ఉయ్యారు భరత్ కుమార్ రెడ్డి, PACS అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ రెడ్డి ,ఎంపీడీఓ శంకర్ రావు ,వెలుగు ఏపీఎం శ్రీనివాస్,మండల సమాఖ్య ప్రతినిధులు, వైఎస్ఆర్ క్రాంతి పద సిబ్బంది సీసీలు, ఆపరేటర్, అకౌంటెంట్, వివో ఏలు,తదితరులు పాల్గొన్నారు.










