ప్రజాశక్తి - చాపాడు : మైదుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం వైఎస్ఆర్సీపీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా విద్యార్థులకు 500 ప్లేట్లు, పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్ వితరణగా అందజేశారు. ఈ సందర్భంగా రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ రాజశేఖరుడి పాలనకు మించి జగనన్న పాఠశాలలను అభివృద్ధి చేసారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ ,108 ,ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకాలు నేటికీ ప్రజలకు ఫలాలను ఇస్తున్నాయన్నారు. అనంతరం విద్యార్థులకు ప్లేట్స్, పాఠశాలకు ఫర్నిచర్ పంపిణీ చేశారు. బాలికల పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సిబ్బంది కొరగా తప్పక చేస్తామని హమి ఇచ్చారు. అనంతరం ఉపాధ్యాయులు రాచమల్లు రవిశంకర్ రెడ్డిని శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.










