Oct 23,2020 22:16

వినియోగదారులకు ఉల్లిపాయలు అందిస్తున్న తాతబాబు

ప్రజాశక్తి - శ్రీకాకుళం సిటీ: ఉల్లి ధరల పెరిగిన నేపథ్యంలో రైతుబజారులో రాయితీపై విక్రయాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని ఆర్ట్స్‌ కాలేజీలో నిర్వహిస్తున్న రైతుబజార్‌లో ఎఎంసి చైర్మన్‌ మూకళ్ల తాతబాబు అధ్యక్షతన మార్కెటింగ్‌శాఖ ఎడి శ్రీనివాస్‌ కిలో ఉల్లి రూ.40కు అందించే కౌంటర్‌ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎఎంసి చైర్మన్‌ మూకళ్ల తాతబాబు మాట్లాడుతూ ఉల్లి ధరలు పెరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజలపై భారం పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో రూ.80 నుంచి రూ.100 పలుకుతున్న సందర్భంలో కిలో రూ.40కే అందించడం గొప్ప నిర్ణయమన్నారు. ఒక్కో కుటుంబానికి కిలో చొప్పున విక్రయించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.